బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కోలుకోలేకపోతున్నారు. సుశాంత్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. సుశాంత్ చేసిన సినిమాలు, సీరియల్స్, ఇతర పర్ఫామెన్స్‌లకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా సుశాంత్‌ గతంలో  చేసిన ఓ స్టేజ్‌ పర్ఫామెన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే డ్యాన్స్‌ క్లాస్‌లో జాయిన్‌ అయ్యాడు. అదే సమయంలో పలు టీవీ షోస్‌తో పాటు డ్యాన్స్‌ షోస్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదిక మీద కూడా పర్ఫామ్‌ చేశాడు. అయితే ఆ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా షోస్ చేశాడు సుశాంత్. 2006లో కామన్‌వెల్త్‌ గేమ్స్ సందర్భంగా బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ పర్ఫామ్‌ చేసింది. ఈ పర్ఫామెన్స్‌లో సుశాంత్ బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా కనిపించాడు.

తాజాగా సుశాంత్ మరణంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుశాంత్‌ మరణంపై ఐశ్వర్యకూడా స్పందించింది. తనతో సినిమాల్లో కలిసి పనిచేసిన బంధం లేకపోయినా డ్యాన్సర్‌గా తనతో కలిసి వర్క్ చేసిన సుశాంత్‌ను గుర్తు చేసుకొని నివాళి అర్పించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సుశాంత్‌కు నివాళి అర్పిస్తూ కామెంట్ చేసింది ఐశ్వర్య. గతంలో తాను బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఐశ్వర్య పాటకు చేసిన అనుభవాన్ని సుశాంత్‌ కూడా గుర్తు చేసుకున్నాడు. షోలో భాగంగా ఐశ్వర్యను పైకి ఎత్తే మూమెంట్‌తో ఆమెను పైకి ఎత్తి తరువాత కిందకు దించటం మరిచిపోయాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సుశాంత్‌ స్వయంగా వెల్లడించాడు.