Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌.. ట్విటర్‌కు పోలీసుల లేఖ

సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్‌కు సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ట్విటర్‌లో సుశాంత్‌కు 2.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా, 757 మందిని సుశాంత్  ఫాలో అవుతున్నాడు. అయితే సుశాంత్ చివరగా డిసెంబర్ 27, 2019లో చివరి ట్వీట్ చేశాడు.

Sushant Singh Rajput suicide case: Police writes to Twitter India
Author
Hyderabad, First Published Jun 30, 2020, 2:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీ సుశాంత్ ఆత్మహత్యకు ఇండస్ట్రీలోని నెపోటిజం కారణం అంటూ ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సహా ఆయన సన్నిహితులు, ఇతర ఇండస్ట్రీ ప్రముఖులతో కలిసి 27 మంది విచారించారు పోలీసులు.

తాజాగా సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్‌కు సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ట్విటర్‌లో సుశాంత్‌కు 2.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా, 757 మందిని సుశాంత్  ఫాలో అవుతున్నాడు. అయితే సుశాంత్ చివరగా డిసెంబర్ 27, 2019లో చివరి ట్వీట్ చేశాడు. అది కూడా ఓ పెయిడ్ ట్వీట్‌. ఐసీఐసీఐ మాస్టర్ కార్డ్‌ ప్రమోషన్‌ నిమిత్తం ఆ ట్వీట్ చేశాడు సుశాంత్.
 

అయితే సుశాంత్ చనిపోవడానికి కొన్నినిమిషాల ముందుకు సుశాంత్ మూడు ట్వీట్‌లు చేసి వాటిని డిలీట్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్విటర్‌ ఇండియాకు సుశాంత్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. నిజంగా సుశాంత్ ఆత్మహత్యకు ముందు ట్వీట్ చేసి ఉంటే ఏమని చేసి ఉంటాడు. ఆ ట్వీట్‌లో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించి ఉంటాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios