బాలీవుడ్ సీరియల్ నటి అంకితా లోఖాండే పేరు ఇటీవల మీడియాలో మారుమోగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తరువాత అంకితా పేరు మీడియాలో వైరల్‌ అయ్యింది. సుశాంత్ టెలివిజన్‌ నటుడిగా ఉన్న సమయంలో కొంత కాలం అంకితతో సన్నిహితంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణం తరువాత అంకితను కూడా విచారించారు పోలీసులు. అంతేకాదు సుశాంత్‌ కుటుంబ సభ్యులు కూడా అంకిత గురించి పాజిటివ్‌గా చెప్పటంతో అంకిత గురించి సుశాంత్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

దీంతో సుశాంత్ అభిమానులతో పాటు సాధారణ నెటిజెన్లు కూడా అంకితకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ట్విన్స్‌ను తన ఒల్లో పడుకోబెట్టుకొని ఆనందంగా ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన అంకితా.. `మా ఫ్యామిలీ ఆనందంగా ఉంది. కొత్త జీవితాలు ప్రారంభమయ్యాయి. మా పరిసరాలు ఈ ట్విన్స్‌ జన్మించటంతో మరింత సంపన్నమయ్యాయి. అబీర్‌, అభీరాలకు వెల్‌కం` అంటూ కామెంట్ చేసింది.

అకింతా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆమె పోస్ట్‌కు 5 లక్షలకు పైగా లైక్స్ రాగా, 6,500లకు పైగా కామెంట్స్ వచ్చాయి. అయితే చిన్నారుల ఫోటోను ట్వీట్ చేసిన అంకితా వారి తల్లి దండ్రులు ఎవరు, వారు తనకు ఏమౌతారు అన్న విషయాన్నిమాత్రం ప్రస్తావించలేదు. సుశాంత్ తో విడిపోయిన తరువాత అంకితా, విక్రీ జైన్‌ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను విక్కీతో రిలేషన్‌లో ఉన్న విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా ప్రేమలో ఉన్నానని మాత్రం చెప్పింది అంకితా.