దిల్ బెచార సినిమాలో సుశాంత్‌ను చివరి సారిగా చూసిన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఈ సినిమాను ఈ నెల 24న డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతమందించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తాజాగా సుశాంత్ చివరి చిత్రం దిల్ బెచారను రిలీజ్ రెడీ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడదల చేసింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న కిజ్జీ (సంజన సంఘీ) అనే అమ్మాయి జీవితంలోకి మన్నీ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) వస్తాడు.
మన్నీ పరిచయంతో కిజ్జీ జీవితంలో ఆశలు చిగురిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ కలుగుతుంది. ఇలా భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్‌ను ఎమోషనల్‌గా కట్ చేశారు. ముఖ్యంగా సుశాంత్‌ను చివరి సారిగా చూసిన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఈ సినిమాను ఈ నెల 24న డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతమందించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసింది. బాలీవుడ్‌లోని రాజకీయాలు నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించాడన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అన్ని కోణాలో విచారణ జరుపుతున్నారు, ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులను విచారించారు. తాజాగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కూడా విచారించారు పోలీసులు.
