'సూర్యకాంతం' ట్రైలర్ చూశారా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 26, Mar 2019, 4:29 PM IST
Suryakantam movie trailer
Highlights

మెగాడాటర్ నీహారిక కొణిదెల, రాహుల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సూర్యకాంతం'. ప్రణిత్ బ్రమండపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

మెగాడాటర్ నీహారిక కొణిదెల, రాహుల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సూర్యకాంతం'. ప్రణిత్ బ్రమండపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమా కథను ఎన్నుకున్నాడు దర్శకుడు. ఒక అబ్బాయి ఇద్దరి అమ్మాయిలను ఇష్టపడతాడు. 

అందులో ఒకరు డిమాండింగా, బోల్డ్ గా ప్రవర్తిస్తే మరొకరు సెన్సిబుల్ గా ఉంటారు. వీరిద్దరిలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేదే సినిమా. ట్రైలర్ లో నీహారిక మిడిల్ ఫింగర్ చూపించడం హైలైట్ గా నిలిచింది.

మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. వరుణ్ తేజ్ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించారు. 

loader