పాలిటిక్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కోలీవుడ్ సినిమా కాప్పాన్. సూర్య మోహన్ లాల్ అలాగే ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ జనాలు ఆసక్తి బాగానే చూపిస్తున్నారు. రంగం దర్శకుడు కెవి. ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను లైకా ప్రౌడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 

ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుండగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ గురించి ఇటీవల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ అవుతున్న ఆగస్ట్ 15కి సూర్య కాప్పాన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో ముగ్గురు సౌత్ స్టార్ నటులు నటిస్తుండడంతో తెలుగులో కూడా అంచనాలు పెరుగుతున్నాయి. 

మరోవైపు సాహు రిలీజ్ షాడో సినిమాకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తేలుస్తోంది. బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో బిజినెస్ -  క్రేజ్ ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య సౌత్ మొత్తంలో అన్ని భాషల్లో గట్టిపోటీ నెలకొంది. మరి ఆ ఫైట్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.