ఇటీవల సూర్య తండ్రి శివకుమార్ ఓక అభిమానిపై దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మొదట ఆయన తన ప్రవర్తనను సమర్ధించుకున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక అభిమాని ఫోన్ ను నేలకేసి కొట్టిన వీడియో ఇప్పటికే వైరల్ అవుతూనే ఉంది. 

ఎవరో తెలియని అభిమానులకు సెల్ఫీ ఎందుకు ఇవ్వాలి? అంటూ విమర్శలు చేయడం కూడా అందరిలో వ్యతిరేఖ భావనను కలిగించింది. దీంతో శివకుమార్ పై మరిన్ని విమర్శలు రాగా ఫైనల్ గా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడున్నా పరిస్థితుల్లో తాను క్షమాపణలు చెప్పడమే కరెక్ట్ అని అందరికి తన అభిప్రాయం నచ్చలేదు గనక క్షమించమని కోరుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

దీంతో సూర్యా కార్తీ ల అభిమానుల ఆగ్రహం చల్లారినట్లు తెలుస్తోంది. అయితే శివకుమార్ ఈ విధంగా సారి చెప్పి స్పందించడానికి కారణం సూర్య అని కోలీవుడ్ లో వార్తలు వెలువడుతున్నాయి. వెంటనే వివరణ ఇచ్చి సారి చెప్పమని సూర్యానే తండ్రికి చెప్పినట్లు తమిళ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి.