అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ నోటాతో హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ట్యాక్సీ వాలా సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అయితే సినిమా కొన్ని రోజుల క్రితమే లీక్ అయిన సంగతి తెలిసిందే. 

ఆ భయం కొంచెం చిత్ర యూనిట్ లో ఉన్నప్పటికీ సినిమా థియేటర్ లో చూసిన తరువాత సరికొత్త ఫీల్ కలుగుతుందని తప్పకుండా సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే విజయ్ భావోద్వేగంతో రీసెంట్ గా ఒక ట్వీట్ చేశాడు.నేను బాధలో ఉన్నప్పుడు ఉత్తేజాన్ని నింపేది ఎవరో మీకే తెలుసు. వారెవరో కాదు. మీరే. 

మీ మద్దతు నాకు నిత్యం ఉంటుందని అనుకుంటున్నా అని విజయ్ పేర్కొన్నాడు. దీంతో నెటిజన్స్ ఒక్కసారిగా ఈ హీరోకు మద్దతు పలికారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా విజయ్ ట్వీట్ పై స్పందించాడు.  నీపై మా ప్రేమ ఉంటుంది. ఎలాంటి బాధ అవసరం లేదు అంటూ టాక్సీ వాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు సూర్య వివరణ ఇచ్చారు. 

అందుకు విజయ్ కూడా ఉప్పొంగిపోతూ సూర్య సర్ ఐ లవ్ యూ అంటూ రీ ట్వీట్ చేశాడు. అందుకు సంబందించిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ తో సూర్య కి మంచి రిలేషన్ ఉంది. అలాగే కార్తీ కూడా సన్నిహితంగానే ఉంటాడు.