యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. డివివి దానయ్య నిర్మాణంలో ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ  చిత్ర నేపథ్యం గురించి వివరించారు. 1920 కాలంలో స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. 

రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. దీనితో రాంచరణ్, ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఆడియన్స్ లో ఎక్కువైంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రాంచరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నారట. 

స్వాతంత్ర ఉద్యమ వీరుల గురించి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఆగష్టు15న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే బావుంటుందనే అభిప్రాయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాంచరణ్ కు హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది.