Asianet News TeluguAsianet News Telugu

సూర్య ఒక్క షాట్ కోసం 26 టేకులు తీసుకున్నాడు.. డైరెక్టర్ సుధా కొంగర సంచలన వ్యాఖ్యలు

సౌత్ స్టార్ హీరో.. సూర్యతో రెండు సినిమాలకు పనిచేసింది లేడీ డైరెక్టర్ సుధ కొంగర. ఆ అనుభవాలను తాజాగా మీడియాతో పంచుకుంది. పనిలో పనిగా సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. 
 

Suriyas Dedication Revealed by Sudha Kongara: Insights from Their Collaboration JMS
Author
First Published Jul 18, 2024, 7:17 PM IST | Last Updated Jul 18, 2024, 7:17 PM IST

ప్రముఖ స్టార్ డైరెక్టర్  మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేసింది ప్రస్తుత దర్శకురాలు సుధా కొంగర.  ప్రస్తుతం తమిళ సినీ ప్రముఖ దర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు ఆమె.  మొదట 2010 యాక్షన్ చిత్రం డ్రోగితో ఆడియన్స్  దృష్టిని ఆకర్షించిన సుధ... దీని తర్వాత 2016లో సుత్రు అనే సినిమాను దర్శకత్వం వహించారు. మాధవన్, రితికా సింగ్ మరియు ఇతరులు నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈసినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా గురు టైటిల్ తో రీమేక్ చేశారు.

దీని తర్వాత 2020లో సూర్యతో సూరిరై పొట్టు అనే బయోపిక్‌కి దర్శకత్వం వహించారు సుధ కొంగర. ఈ సినిమా ప్రముఖ  విమానయాన రంగ ప్రముఖుడు..  ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి.ఆర్ గోపీనాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కించింది. ఈసినిమా సౌత్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఎన్నో అవార్డ్ లను తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం సూర్యతో మరోసినిమా తెరకెక్కిస్తోంది సుధ కొంగర.

ఇదిలా ఉంటే, సుధా కొంగర సూర్యతో పనిచేసిన రెండు సినిమాలకు సబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఆమె  మాట్లాడుతూ ''సూర్య సైలెంట్‌గా కూర్చున్నట్లుగా ఉంటారు.. కాని సైలెంట్ గా మాత్రం ఉండరు. సూర్య నిరంతర విద్యార్ధిలా ఫీల్ అవుతారు. తన డైలాగ్స్ ను ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు..  నేను అతని ప్రక్రియను చూశాను, కానీ నేను దానిని పంచుకోవాలో లేదో నాకు తెలియదు. అతను గోడ దగ్గర నిలబడి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం నేను చూశాను. 

Suriyas Dedication Revealed by Sudha Kongara: Insights from Their Collaboration JMS

సెట్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుంటూ కొంగ‌ర మాట్లాడారు. . ``నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నాను. షూటింగ్ లో సీన్.. తలుపు తట్టిన చప్పుడు వినగానే తలుపు తెరవాలి. అయితే ఆ షాట్ ఓకే అవ్వడానికి సూర్యకు 26 టేకులు పట్టింది. మణి సర్ కూడా ఒక దశలో టేక్ కు ఓకే చెప్పారు. కానీ సూర్య వినలేదు. ఈ  టేక్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకూ చేస్తాను అని చేస్తూనే ఉన్నారు. ఆయన ఏ చిన్న సీన్ అయినా.. తన బెస్ట్ ఇవ్వాలని చూస్తారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు అని అన్నారు సుధ కొంగర.  

ఆరోజు ఇంకొంచెం, ఇంకొంచెం అంటూ 26 టేకులు తీసుకున్నాడు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. 'ఇది చాలు' అని సూర్య ఎప్పుడూ చెప్పడు. ఇంకా చెప్పాలంటే, 'వద్దు సూర్యా, నువ్వు బాగా చేశావని చెప్పినా కాని.. ఆయన వదిలిపెట్టరు..  తన ప్రయత్నాన్ని విరమించుకోడు. సూర్యలో ఉన్న ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం” అన్నారు అని అన్నారు సుధ. 

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సుధా కొంగర తెరకెక్కించిన సినిమా సూరారై పోట్రు సినిమాకి భారీ స్పందన లభించడంతో పాటు జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటితో సహా 5 జాతీయ అవార్డులను గెలుచుకుంది. అయితే హిందీలో సురారై పొట్టు రీమేక్ అయిన సర్ఫిరా యావరేజ్ అవ్వగా.. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కు కూడా భారీ స్పందన వచ్చింది.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios