'విక్రమ్' సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. రోలెక్స్ గా సూర్య కనిపించిన కొన్ని నిముషాలు మరో ఎత్తు. రోలెక్స్ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు.

కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్ రిలీజైన నాటి నుంచి ‘రోలెక్స్’ పేరు తెగ మారు మ్రోగుతోంది. ముఖ్యంగా తమిళ ఫిల్మ్ జనాలకు ఆ చివరి మూడు నిముషాలు తెగ పట్టేసింది. సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామాకు అయితే లోటే లేదు. సూర్య ఫుల్ ప్లెడ్జెడ్ హీరోగా చేసిన ఈ మధ్య కాలంలో చేసిన ఏ మాస్ సినిమాకు ఈ స్దాయి క్రేజ్ రాలేదు. దాంతో సూర్య అభిమానులు ఆనందానికి అంతేలేదు. దాంతో ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ ...‘రోలెక్స్’ టైటిల్ తో చిత్రం చేయమని తమ అభిమాన హీరోని కోరుతున్నారు. వెంటనే లోకేష్ కనకరాజ్ తో ఈ సినిమా చేయమని అడుగుతున్నారు. ఆ సినిమాలో సూర్యని పూర్తి స్దాయి విలన్ గా చూడాలని వారి ఆశగా చెప్తున్నారు.

 అటు హీరో కమల్ అయినా మరొకరు అయినా తమకు ప్లాబ్లం లేదని, తమ హీరో విలన్ గా చూడటమే తమ ఆనందం అన్నట్లు రోలెక్స్ టైటిల్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పెడుతున్నారు. నిజంగానే ‘రోలెక్స్’టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చేటట్లు ఉంది. ఇక ఈ విషయమై కమల్ స్పందించారు. నెక్స్ట్ సీక్వెల్ లో సూర్య చేసిన రోలెక్స్ రోల్ సినిమా అంతా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి అందులో విక్రమ్ వర్సెస్ రోలెక్స్ యుద్దం ఎలా ఉంటుందో చూడాల్సిందే. అదే సమయంలో వీరితో ఖైదీ నుంచి కార్తీ కూడా కనిపించే అవకాశం ఉంది.

సూర్య పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని.. దీనికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి తన దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయని దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. మరి రాబోయే రోజుల్లో విక్రమ్ - ఢిల్లీ - రోలెక్స్ - అమర్ లతో డైరెక్టర్ లోకేష్ మల్టీవర్స్ లో ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

తెలుగులో'విక్రమ్' సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై టాలీవుడ్ యువ హీరో నితిన్ రిలీజ్ చేశారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.