చాలా ఏళ్ల తర్వాత ఆస్కార్‌  అవార్డు పోటీలో ఇండియన్‌ సినిమాలు నిలిచింది. తాజాగా సూర్య హీరోగా నటించిన `ఆకాశమే నీ హద్దురా'(సూరారై పోట్రు) చిత్రం అకాడమీ అవార్డ్ బరిలో నిలిచింది. విదేశీ విభాగంలో ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళీ ఆస్కార్‌ నామినేషన్స్ కి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 

సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందగా, సూర్య, అపర్ణ బాలమురళీ జంటగా నటించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లు ఓపెన్‌ అయ్యాక థియేటర్లలోనూ రిలీజ్‌ అయి ఆకట్టుకుంటుంది. ఎయిర్‌ దక్కన్‌ అధినేన గోపీనాథ్‌ జీవితం ఆధారంగా, ఆయన తక్కువ ధరకే విమాన టికెట్టుని ప్రవేశ పెట్టి దేశంలోనే సంచలనం సృష్టించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇదిలా ఉంటే ఆస్కార్‌ నామినేషన్‌కి పంపిన `జల్లికట్టు` చిత్రం నామినేషన్స్ కి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.