Asianet News TeluguAsianet News Telugu

సూర్య `జైభీమ్‌` సినిమా మరో ఘనత.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక

తాజాగా 'జై భీమ్' సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022 కు ఎంపికైంది. 

suriya starrer jai bhim movie selected noida film festival
Author
Hyderabad, First Published Jan 19, 2022, 11:17 PM IST

సూర్య నటించిన `జైభీమ్‌` సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఓ పేద కుటుంబంపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, వాళ్లని ఎలా బలిపశువులను చేస్తున్నారనే విషయాన్ని, అదే సమయంలో న్యాయంకోసం ఓ పేద మహిళ చేసిన పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. అరుదైన రికార్డు లు క్రియేట్‌ చేసింది. ఓటీటీలో విడుదలై కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కడం, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం విశేషం. 

మాజీ జస్టిస్‌ కె. చంద్రు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. సూర్య హీరోగా నటించారు.  భారతదేశంలోని సామాజిక అసమానతలు - కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. గిరిజనులు అణగారిన వర్గాలు - ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై అన్యాయంగా కొందరు పోలీసులు చేసే దుశ్చర్యలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన 'జై భీమ్' చిత్రం గురించి ఇటీవల ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో కొనియాడారు. అలానే సినిమా రేటింగ్ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

తాజాగా 'జై భీమ్' సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022 కు ఎంపికైంది.  ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కష్టానికి గుర్తింపు దక్కుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. తాము గర్వంగా ఫీలవుతున్నామని వెల్లడించింది. ఈ చిత్రంలో సూర్యతోపాటు మణికందన్,  లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించారు.  ప్రకాష్ రాజ్, రజిషా విజయన్ కీలక పాత్రల్లో మెరిశారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios