2020కి గాను 68వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. అత్యధికంగా ఐదు అవార్డ్స్ గెలుచుకున్న సూరారై పోట్రు జాతీయ వేదికపై సత్తా చాటింది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుపొందింది. 

డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపినాధ్ జీవితకథ ఆధారంగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర సూరారై పోట్రు తెరకెక్కించారు. 2020లో కరోనా ఆంక్షల నేపథ్యంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సూరారై పోట్రు డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. కాగా సూరారై పోట్రు చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా హీరో సూర్య అగ్రెసివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ లో మాయ చేశారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి చాలా సహజంగా నటించారు. 

సూరారై పోట్రు(Soorarai Pottru) మూవీతో సూర్య జాతీయ అవార్డు గెలుపొందడం ఖాయమని అందరూ ఊహించారు. అంచనాలు తప్పకుండా ఈ మూవీ ఐదు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుపొందింది. జాతీయ ఉత్తమ నటుడిగా సూర్య (Suriya)అవార్డు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా జాతీయ ఉత్తమ చిత్రం(Best Movie) అవార్డుకి జ్యూరీ సభ్యులు సూరారై పోట్రుని ఎంపిక చేశారు. సూరారై పోట్రు దర్శకురాలు సుధా కొంగరకు ఈ అవార్డు దక్కనుంది. ఆమెకు రజత కమలంతో పాటు రూ. 1 లక్ష రూపాయలు బహువతిగా ఇవ్వనున్నారు. 

ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం(Best Movie) విభాగాలతో పాటు ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో సూరారై పోట్రు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, స్క్రీన్ ప్లే కి గాను సుధా కొంగర, షాలినీ ఉషాదేవి నేషనల్ అవార్డులు గెలుపొందారు. ఐదు అవార్డులు(National Awards) దక్కించుకున్న సూరారై పోట్రు జాతీయ వేదికపై సత్తా చాటింది. ఇక తమిళ పరిశ్రమకు 8 జాతీయ అవార్డ్స్ దక్కాయి.తమిళ విభాగంలో ఉత్తమ చిత్రంగా శివరంజనియుమ్‌ ఇన్ను శిలా పెంగలుమ్‌ జాతీయ అవార్డు గెలుపొందింది. అలాగే బెస్ట్ ఎడిటింగ్ అవార్డు ఈ చిత్రానికి దక్కింది. శ్రీకర్ ప్రసాద్ ఆ చిత్ర ఎడిటర్ గా ఉన్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లై డైలాగ్‌ విభాగంలో మండేలా చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. మొత్తం 8 అవార్డ్స్ తో కోలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉండగా హిందీకి నాలుగు, తెలుగుకు నాలుగు జాతీయ అవార్డ్స్ దక్కాయి. 

ఉత్తమ నటుడు అవార్డు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సూర్యతో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ కి జాతీయ అవార్డు దక్కింది. హిస్టారికల్ మూవీ తన్హాజి లో నటనకు గాను జ్యూరీ సభ్యులు ఆయనకు అవార్డు ప్రకటించారు.కాగా తెలుగు నుండి ఫీచర్చ్ విభాగంలో కలర్ ఫోటో అవార్డు దక్కించుకుంది. అలాగే అల వైకుంఠపురంలో చిత్రంలోని సాంగ్స్ కి గాను థమన్ జాతీయ అవార్డు గెలుపొందారు.