తమిళ్ స్టార్ హీరో సూర్య మొన్నటివరకు మెల్లగా సినిమాలు రిలీజ్ చేసినా ఇప్పుడు మాత్రం సెట్స్ పై ఒక సినిమా ఉండగానే చక చక కథలను ఒకే చేస్తున్నాడు. కాస్త నచ్చినా కూడా వచ్చిన స్టార్ దర్శకులను వెనక్కి పంపకుండా నచ్చే విధంగా స్క్రిప్ట్ లో చేంజెస్ చేయిస్తున్నాడు. 

ఇక కమర్షియల్ సినిమాలతో హిట్టందుకుంటూ అజిత్ తో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న దర్శకుడు శివ ఇప్పుడు సూర్యతో కలిశాడు. అజిత్ తో వీరమ్ - వేదలమ్ - వివేగం - విశ్వాసం సినిమాలు చేసిన శివ అయిదేళ్ల .అనంతరం మరో హీరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యకి మొదటి శివ చెప్పిన అంతగా నచ్చకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త మార్పులు కోరాడు. 

దీంతో వెంటనే ఒప్పుకున్నా శివ ఫైనల్ గా ఫుల్ స్క్రిప్ట్ తో సూర్యని ఒప్పించాడు. సూర్య హోమ్ బ్యానర్ స్టూడియో గ్రీన్ లో జ్ఞాన్ వెల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ - NGK సినిమాతో పాటు కెవి.ఆనంద్ - కాప్పాన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక సుధా కొంగర ప్రసాద్ డైరెక్షన్ లో కూడా సూర్య ఒక సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.