సూర్య నటించిన బందోబస్త్ చిత్రం త్వరలో తెలుగు తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో ఈ చిత్రం కప్పాన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్నిరోజుల క్రితం కప్పాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

యాక్షన్ సన్నివేశాలని కళ్ళు చెదిరేలా చిత్రీకరించారు. హీరో సూర్య ప్రతి సన్నివేశంలో తన నటనతో అదరగొడుతున్నాడు. ఇక మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర, బోమన్ ఇరానీ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. 

పోలీసులు నీళ్ళూ అందిస్తారు..నిప్పులూ కురిపిస్తారు అంటూ సూర్య చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. తమిళ నటుడు ఆర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. టెర్రరిస్ట్ అటాక్స్, సెక్యూరిటీ అధికారిగా సూర్య చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

సాధారణంగా కెవి ఆనంద్ తన మార్క్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లతో అబ్బురపరుస్తారు. బందోబస్త్ చిత్రంలో కూడా కథ వర్కౌట్ అయితే యాక్షన్ ప్రియులకు ఈ చిత్రం పండగే. చూడాలి ఈ చిత్రం ఏరేంజ్ సక్సెస్ అవుతుందో!