తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’(సూరారై పొట్రు).  అమెజాన్ ప్రైమ్ ద్వారా  రిలీజ్ కాబోతన్న ఈ సినిమా కొత్త ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఎయిర్ ద‌క్కన్ వ్యవ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘ‌ట‌న‌లు, క‌ష్టాల‌ను ఆధారం చేసుకొని రూపొందిన సినిమా ‘ఆకాశం నీ హ‌ద్దురా’.  గోపీనాథ్‌ జీవితకథగా వెలువడిన సింప్లి ఫై'  పుసక్తానికి కల్పిత వెర్షన్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

‘పేద ప్రజలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేయాలన్న సంకల్పంతో ఓ విమాన సంస్థను స్థాపించాలనుకున్న ఓ సామాన్య యువకుడు ఆ క్రమంలోనే ఎదుర్కొన్న సవాళ్లను కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

 కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో సూర్య ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లా్‌ట్‌ఫామ్‌లో విడుదల చేసేందుకు సూర్య సహా నిర్మాతలందరూ నిర్ణయించుకున్నారు. తొలుత అక్టోబర్ 30 విడుదల చేయాలనుకున్నప్పటికీ.. తాజాగా నవంబర్‌ 12కి వాయిదా వేశారు.సూర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మోహ‌న్‌బాబు, అప‌ర్ణా బాల‌ముర‌ళి ప్రధాన పాత్రధారులు. సుధ కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య, గునీత్ మోంగా నిర్మించారు.