సరికొత్తగా విశ్వరూపం చూపించబోతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ప్రయోగాలకు ఎప్పుడు సిద్దంగా ఉండే సూర్య.. ఈసారి ఎవరూ ఊహించని విధంగా కనిపించబోతున్నాడు. ఆయన నటిస్తున్న ఎక్స్ పర్మెంటల్ మూవీ కంగువ. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ కు ముహూర్తం కుదిరింది.
కోలీవుడ్ స్టార్ హీరో.. సూర్య నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ కంగువ . ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు.. లాంఛ్ చేసిన పోస్టర్లు నెట్టింట హల్‌చల్ చేస్తూ.. సినిమాపై హైప్‌ను ఇంకా పెంచేస్తున్నాయి. కాగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కు రెడీ అవుతున్నారు కంగువ మూవీ టీమ్. దానికి సబంధించిన అనౌన్స్ మెంట్ కూడా డిఫరెంట్ గా చేశారు.
శివ దర్శకత్వంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది కంగువ మూవీ. యాక్షన్ డ్రామా బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈసినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ గ్లింప్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కంగువ నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు నెట్టింట హల్‌చల్ చేస్తూ.. సినిమాపై హైప్‌ను పెంచేస్తున్నాయి. కాగా ఇప్పుడు మరో లుక్‌ను విడుదల చేస్తూ కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్.
హీరోగా కంగువ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను జులై 23న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. అంతే కాదు సూర్యకు సబందించి సూపర్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. కంగువ టీమ్ పంచుకున్న ఈ పోస్టర్ లో.. సూర్య యుద్ధవీరుడిలా ఖడ్గం చేతబట్టి.. కదనరంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఉన్న లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో విజయ్ హ్యాండ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. టాటూలతో.. ఫిట్ గా.. కనిపిస్తుంది. ఈ మూవీలో సూర్య టోన్డ్ బాడీతో అలరించబోతన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ కంగువ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఆడియన్స్ లో క్యూరియాసిటీని కూడా పెంచేస్తుంది. ప్రతీ మచ్చ ఓకథను చెబుతుంది. రాజు వస్తున్నాడు.. కంగువ గ్లింప్స్ జులై 23న అంటూ తాజా లుక్‌ను షేర్ చేసుకున్నారు మేకర్స్. లేటెస్ట్ పోస్టర్‌తో ఫుల్ ఖుషీ అవుతూ.. ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కంగువ 10 భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ౩డీ ఫార్మాట్‌లో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. 2024 సమ్మర్ కంటే మందే ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
