హీరో సూర్య సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. తన భార్య, నటి జ్యోతికతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వెకేషన్‌కు వెళ్లారు.

ఇటీవ‌ల విడుదలైన ‘రెట్రో’ చిత్రంతో హిట్ అందుకున్న హీరో సూర్య, ఇప్పుడు సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఈ సమయంలో ఆయన తన భార్య, నటి జ్యోతికతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని అందమైన ద్వీప సముదాయమైన సీషెల్స్‌కు వెకేషన్‌కు వెళ్లారు.

ఈ ట్రిప్ సందర్భంగా బీచ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఇద్దరూ చేయి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటోలు, కొన్ని వీడియోల్ని జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ దృశ్యాలకి ఆమె "స్వర్గంలో మరో రోజు మనిద్దరం" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉండగా, సూర్య మరో చిత్రమైన *కరుప్పు’లోనూ నటిస్తున్నారు. దీనికి ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

View post on Instagram

జ్యోతిక విషయానికొస్తే, ఇటీవల ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కి ఆమె పాత్రకు మంచి స్పందన లభించింది.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ సూర్య, జ్యోతిక జంట అందర్శంగా నిలుస్తున్నారు. గతేడాది సూర్యకి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ షాక్ తగిలింది. సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువ డిజాస్టర్ గా నిలిచింది.