విభిన్న పాత్రలతో కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సూర్య సౌత్ లో ఒక మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. తెలుగులో అతనికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సూర్య ఎప్పుడు కనిపించని రైతు పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ స్మార్ట్ హీరో సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జీక' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమాలో సూర్య చేసే పాత్ర గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తున్నాయి. ముందుగా ఒక రాజకీయ నాయకుడి రోల్ చేయనున్నాడని టాక్ వచ్చింది. ప్రస్తుతం సూర్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం సూర్య ఒక వ్యవసాయం చేసే రైతులా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తమ్ముడు కార్తీ చినబాబులో ఒక రైతుగా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. 

ఇక ఇప్పుడు సూర్య కూడా అ పాత్రలో కనిపించి మెప్పించాలని అనుకుంటున్నాడు. దర్శకుడు సెల్వా రాఘవన్ కూడా సూర్య క్యారెక్టర్ ను స్పెషల్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.