కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వలేకపోయాడు. గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న ఈ హీరో తెలుగులో ఏర్పరచుకున్న మార్కెట్ సైతం ఇప్పుడు బాగా డల్లయిపోయింది. గతంలో సూర్య టాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగానే సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకునేవారు. 

కానీ ఇప్పుడు ఎలాంటి సినిమా చేసినా వర్కౌట్ కావడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా బందోబస్త్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య వీకెండ్ లో వాల్మీకి అనుకున్నంతగా పోటీని ఇవ్వలేకపోయారు. కెవి. ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన బందోబస్త్ లో మోహన్ లాల్ కీలకపాత్రలో కనిపించారు. ఆర్య కూడా సైడ్ హీరోగా కనిపించాడు. 

రిలీజ్ కి ముందు టీజర్ ట్రైలర్స్ తో అంచనాల డోస్ పెంచిన బందోబస్త్ రిలీజ్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారాంతరంలో 4కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేకపోయింది. 10కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సూర్య ఆ 6కోట్ల షేర్స్ ని అందుకోవడం కూడా కష్టమే. అయితే కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కినట్లు తెలుస్తోంది.