Asianet News TeluguAsianet News Telugu

జై భీమ్... నాలుగు భాషల్లో సూర్య కొత్త మూవీ!

జై భీమ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ లో పంచుకున్న సూర్య చాలా ఎక్సయిట్ అవుతున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని పేరును తలపించేలా టైటిల్, ఫస్ట్ లుక్ ఉంది.

suriya announces new movie title jai bhim will be released in four languages ksr
Author
Hyderabad, First Published Jul 24, 2021, 9:57 AM IST

హీరో సూర్య ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. ఆయన ఏకంగా పాన్ ఇండియా మూవీ ప్రకటించడం జరిగింది. జై భీమ్ టైటిల్ తో లాయర్ గా సూర్య ఫస్ట్ లుక్ కేకపుట్టించేదిగా ఉంది. దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించనున్న జై భీమ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ బాషలలో విడుదల కానుంది. 


జై భీమ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ లో పంచుకున్న సూర్య చాలా ఎక్సయిట్ అవుతున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని పేరును తలపించేలా టైటిల్, ఫస్ట్ లుక్ ఉంది. సూర్యకు జంటగా రజిష విజయన్ నటిస్తున్నారు. లాయర్ గా సూర్య జై భీమ్ చిత్రంలో తన నట విశ్వరూపం చూపిస్తాడని అనిపిస్తుంది. 


2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ పాండియన్ జై భీమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. సూర్య నటిస్తున్న మరో చిత్రం ఎత్తరుక్కుమ్ తునిందవాన్ ఫస్ట్ లుక్ సైతం సూర్య బర్త్ డే కానుకగా విడుదల చేయడం జరిగింది. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios