Asianet News TeluguAsianet News Telugu

సురేష్ బాబు కు నచ్చింది,త్వరలో రిలీజ్

 ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.  రిలీజ్ విషయంలో సమస్యలు ఎదురు కావటంతో  సురేష్ ప్రొడక్షన్స్ అండగా నిలుస్తోందని సమాచారం. 

Suresh Productions Support a small film
Author
Hyderabad, First Published Nov 6, 2021, 3:08 PM IST

ఆ మధ్యన సురేష్ ప్రొడక్షన్స్ వారు చాలా చిన్న సినిమాలు వెనక ఉండి వాటిని ప్రొపర్ గా రిలీజ్ అవటంలో సహకరించారు. ఆ క్రమంలో చాలా మంది ప్రతిభావంతులు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇప్పుడు అదే క్రమంలో మరో లో బడ్జెట్ చిత్రం డ‌బ్లూ డ‌బ్లూ డ‌బ్లూ కూడా సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో బయిటకు వస్తోంది. ఈ సినిమాని గుహన్ డైరక్ట్ చేసారు. గుహన్ అంతకు ముందు కల్యాణ్ రామ్ తో 118 అనే చిత్రం రూపొందించారు.

వివరాల్లోకి వెళితే...118 వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ(హూ,వేర్‌,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.  రిలీజ్ విషయంలో సమస్యలు ఎదురు కావటంతో  సురేష్ ప్రొడక్షన్స్ అండగా నిలుస్తోందని సమాచారం. రీసెంట్ గా సురేష్ బాబు ఈ సినిమాని చూసి ఓకే చేసి రిలీజ్ కు సరే అన్నారని చెప్తున్నారు.

చిత్ర నిర్మాత‌ డా. ర‌వి పి.రాజు ద‌ట్ల మాట్లాడుతూ – కేవి గుహ‌న్ గారు తెర‌కెక్కించిన 118 మూవీ ఎంత‌పెద్ద హిట్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలుసు. ఇప్పుడు ఆయ‌న రెండో చిత్రంగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో `డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ` మూవీని రూపొందిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమ‌న్ కె. కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మిర్చికిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. టెక్నిక‌ల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌చేస్తాం అన్నారు.

 

ఈ ఆధునిక యుగంలో ప్రతిది ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది. అలా ఈ చిత్రంలో అందరూ ఆన్‌లైన్‌ చాటింగ్‌ చేస్తూ ఉంటారు. ఉన్నట్లుండి కంప్యూటర్‌ అంతా డార్క్ అయిపోతుంది. ఎవరో హ్యాక్‌ చేసినట్లు ఉంటుంది.  ఇదొక హై కాన్సెప్ట్‌ కథగా ఉందని హీరో రానా అన్నారు

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దట్ల‌,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు ద‌ట్ల ,
క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.

Follow Us:
Download App:
  • android
  • ios