Asianet News TeluguAsianet News Telugu

‘నారప్ప’రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారి థియేటర్స్ లో..

వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సురేష్ ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోంది.

Suresh Productions is releasing #Narappa on December 13th
Author
First Published Dec 6, 2022, 5:05 PM IST

ఇతర భాషల్లో హిట్టైన ప్రతి సినిమాను వెంకీ రీమేక్‌ చేయడు. తనకు సూట్‌ అయ్యే కథలనే ఎంచుకుంటాడు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ పద్దతి. ఆయన తాజాగా రీమేక్‌ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్‌’కి రీమేక్‌ ఇది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప అప్పట్లో  కరోనా కారణంగా థియోటర్ రిలీజ్ కాలేదు.

ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో మంగళవారం(జూలై 20) ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ‘నారప్ప’అందుకుందనే చెప్పాలి.  ధనుష్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిన ‘అసురన్‌’ రీమేక్‌ వెంకీకి  ప్లస్సా.. మైనస్సా అనేది ప్రక్కన పెడితే థియేటర్ లో రిలీజ్ అయితే బాగుండును అనేది చాలా మంది అభిమానులు ఆలోచన. ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది.

అందుతున్న సమాచారం మేరకు వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సురేష్ ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రా,తెలంగాణాలలో  ఈ సినిమాని వెంకటేష్ అభిమానులు కోసం డిసెంబర్ 13న థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమాని అభిమానులు ఏ విధంగా ఆదరిస్తారు అన్నదానిపై ఎన్ని రోజులు సినిమా థియేటర్ లో ఉంచుతారన్నది ఆధారపడనుందని సమాచారం.

చిత్రం కథమిటంటే... అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప(వెంకటేశ్‌) కుటుంబానికి, పక్కగ్రామం సిరిపికి చెందిన భూస్వామి పండుస్వామికి భూ తగాదా చోటుచేసుకుంటుంది. నారప్పకు చెందిన మూడు ఎకరాల భూమిని బలవంతంగా కొనేందుకు ప్రయత్నిస్తాడు పండుస్వామి. అతని ప్రయత్నాలను తిప్పికొడతాడు నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా(కార్తీక్‌ రత్నం). పండుస్వామి మనుషులతో బహిరంగంగానే గొడవకు దిగుతాడు. అంతేకాదు ఒక సందర్భంలో పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు. దీంతో పగ పెంచుకున్న పండుస్వామి.. తన మనుషులతో మునిఖన్నాని హత్య చేయిస్తాడు. అయినా కూడా నారప్ప ఎదురుతిరగడు. 

పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడాన్ని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) జీర్ణించుకోలేకపోతుంది. నిత్యం కొడుకుని తలుచుకుంటూ బాధ పడుతుంది. తల్లి బాధ చూడలేక నారప్ప రెండో కుమారుడు సిన్నప్ప(రాఖీ) పండుస్వామిని చంపేస్తాడు. దీంతో సిన్నప్ప ప్రాణాలను కాపాడేందుకు నారప్ప కుటుంబం గ్రామాన్ని వదిలివెళ్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేంటి? తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? పెద్ద కొడుకు హత్యకు గురైనా నారప్ప ఎందుకు సహనంగా ఉన్నాడు? అసలు నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన రెండో కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. 

Follow Us:
Download App:
  • android
  • ios