Asianet News TeluguAsianet News Telugu

ఇకపై సురేష్ ప్రొడక్షన్స్ నుండి వినసొంపైన సంగీతం

సురేష్ ప్రొడక్షన్స్ సినిమా పరిశ్రమకు సంబంధించిన మరో కొత్త అడుగు వేయనుంది. సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లోగోను ఆవిష్కరించారు. 

suresh productions enters music world stars suresh productions music ksr
Author
Hyderabad, First Published Jun 24, 2021, 6:21 PM IST


చిత్ర నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ ఘన చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. యాభై ఏళ్లకు పైగా వివిధ బాషలలో వందల చిత్రాలు తెరక్కించింది ఈ సంస్థ. మూవీ మొఘల్ గా పేరుగాంచిన డాక్టర్ డి. రామానాయుడు స్థాపించిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ కెరీర్ లో అనేక అజరామర చిత్రాలను తెరకెక్కించడం జరిగింది. రామానాయుడు పెద్ద కుమారుడైన సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యలను ఎప్పటి నుండో చూసుకుంటున్నారు. 


కాగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమా పరిశ్రమకు సంబంధించిన మరో కొత్త అడుగు వేయనుంది. సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లోగోను ఆవిష్కరించారు. 'మన సినిమాల్లో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాన్ని గుర్తించే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్‌ మీద వినసొంపైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మ్యూజికల్‌ పవర్‌హౌజ్‌లా ఉంటుంది' అని తెలియజేస్తూ సంబంధిత లోగోని విడుదల చేసింది సురేశ్‌ ప్రొడక్షన్స్‌.

ఇక సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్ హీరోగా రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం అసురన్ తెలుగు రీమేక్ నారప్ప తో పాటు మలయాళ దృశ్యం 2 రీమేక్ దృశ్యం 2 లో వెంకటేష్ నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కాగా,  విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios