అక్కినేని సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఇరవై ఏళ్ల అమ్మాయిగా మారడమనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సురేష్ బాబు రిలీజ్ చేయనున్నాడు. జూలై 5న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే సురేష్ బాబు ఈ సినిమా అవుట్ పుట్ తో సంతోషంగా లేరని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ చూసి ఇంప్రెస్ అయిన సురేష్ బాబు 'ఓ బేబీ' చూసి అసంతృప్తి వ్యక్తం చేశారట.

ఇప్పుడు రీషూట్ చేసే సమయం కూడా లేకపోవడంతో అదే వెర్షన్ ని రిలీజ్ చేయనున్నారు. గతంలో నందిని రెడ్డి, సమంత కాంబినేషన్ లో 'జబర్దస్త్' సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే నందిని రెడ్డి లిస్ట్ లో 'అలా మొదలైంది', 'కళ్యాణ వైభోగమే' వంటి సినిమాలు ఉండడంతో 'ఓ బేబీ'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.