'బాహుబలి' సినిమాతో రానాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కేవలం సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. డబ్బు, క్రేజ్ ఇలా దేనికి లోటు లేని రానాకి ఒక కన్ను కనిపించదు. ఈ విషయాన్ని ఆయన ఓ టీవీ షోలో తెలిపారు.

తనకు చిన్నప్పుడే కంటి సమస్య వస్తే.. కన్ను తీసేసి మరోకన్ను పెట్టారట. అయితే ఆ కంటికి చూపు మాత్రం లేదు. చిన్నవయసులోనే రానాకు కంటి సమస్య ఎదురైందట. ఈ విషయాలను అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. తనకు కొడుకును స్పోర్ట్స్ మ్యాన్ ను చేయాలని సురేష్ బాబు అనుకున్నారట.

కానీ అది సాధ్యం కాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు తెలిపారు. తనకు క్రీడలపై ఇష్టంతో రానాని స్పోర్ట్స్ మ్యాన్ చేయలనుకున్నారట. ఈ క్రమంలో ముందుగా రానాను ఆర్చరీలో చేర్చగా.. అతడు బాణాన్ని గురిచూసి కొట్టలేకపోయాడని సురేష్ బాబు చెప్పారు. ఆ తరువాత క్రికెట్ లో చేర్పిస్తే.. బంతిని క్యాచ్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడని చెప్పారు.

దీంతో కొన్ని పరీక్షలు చేయిస్తే అతడికి కంటి సమస్య ఉందని వైద్యులు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. దీంతో రానాని క్రీడల్లోకి పంపే ఆలోచన మానుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత రానా సినిమాలపై ఆసక్తి పెంచుకొని ఈ రంగంవైపు వచ్చినట్లు తెలిపారు. కానీ రానాకి క్రికెట్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టమని అన్నారు. ఈ కంటి సమస్య కారణంగా రానా ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని సమాచారం.