చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సురేష్ బాబు... ఎందుకో తెలుసా.?

Suresh babu at dasari narayana rao statue launch
Highlights

చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సురేష్ బాబు

టాలీవుడ్ కు దిశా నిర్దేశం చేయగల స్టాండర్డ్స్ ఉన్న నిర్మాతగా దగ్గుబాటి సురేష్ బాబును చెబుతారు. గత కొన్ని వారాలుగా ఈయన బైట ఎక్కడా కనిపించలేదు. ఆయన గురించి కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. సురేష్ బాబు మాత్రం బైట కనిపించలేదు. ఇందుకు కారణం.. శ్రీరెడ్డి ప్రారంభించిన క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో.. మొదటగా ఈయన కుమారుడు అభిరామ్ పేరుతో పాటు.. ఫోటోలు కూడా బైటకు రావడమే. 

ఈ వివాదం సమసిపోయిందని అనుకున్నా.. తాజాగా మళ్లీ సెటిల్మెంట్ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఆ విషయం పక్కన పెడితే.. ఈ వివాదం సురేష్ బాబు ప్రతిష్టకు దెబ్బ తగిలింది. ఈ ప్రభావంతో మీడియా ముందుకు రాని ఆయన.. ఇవాళ మాత్రం ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు శిలా విగ్రహ ఆవిష్కరణకు అటెండ్ అయ్యారు. నందమూరి బాలకృష్ణతో పాటు పలువురితో కలిసి సాధారణంగానే కనిపించారాయన. వివాదం గురించి ఎక్కడా మాట కూడా దొర్లే అవకాశం లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.

ముఖ్యంగా ఇది దిగ్గజ దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం కావడంతో.. వేరే టాపిక్స్ ఏవీ వచ్చే ఛాన్స్ లేదు. అయితే.. తన కొడుకు విషయంలో సురేష్ బాబు తీరు అభినందనీయం అంటున్నారు పలువురు సినీ జనాలు. ఒకవేళ తన కుమారుడు తప్పు చేసి ఉంటే.. చట్టప్రకారమే అంతా జరుగుతుందని సురేష్ బాబు చెప్పారనే టాక్ ఉంది.

loader