మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైరా పై అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెచుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ కి  ఒక్కరికనే కాకుండా సినిమా కోసం పని చేసిన చాలా మందికి ఈ సినిమా ప్రతిష్టాత్మకమే. 

ముఖ్యంగా కమర్షియల్ దర్శకుడైన సురేందర్ రెడ్డి సినిమాను ఎలా డిజైన్ చేశాడనేది అందరిలో మెదులుతున్న సందేహం.  అందుకే సురేందర్ రెడ్డి సినిమా మొదలుకాకముందు నుంచి చరిత్రతోనే కాలాన్ని గడుపుతున్నాడు. అయితే షూటింగ్ మధ్యలో సినిమాకు సంబందించిన కొన్ని రూమర్స్ అందరికి షాక్ కి గురి చేశాయి. 

సినిమా ఆగిందని సురేందర్ రెడ్డి మేకింగ్ వల్ల ఛాలా సీన్స్ ని రీ షూట్ చేయాల్సి వచ్చిందని అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రాలేదంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ పై సురేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. 

వచ్చిన రూమర్స్ లో ఎలాంటీ నిజం లేదని చెబుతూ.. ఇది ఒక రియాలిటీ ఫిల్మ్. పెద్ద ప్రాజెక్ట్. ఒక సమయాన్ని టార్గెట్ గా పెట్టుకొని ఫినిష్ చేసే కథ కాదు. చాలా సమయం పడుతుంది. అలాగే సినిమా మేకింగ్ వీడియోలో బ్యాక్ డ్రాప్ - విజువల్స్ చూసి చాలా మంది మరో బాహుబలి అని అనుకుంటున్నారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు బాహుబలిని దృష్టిలోకి రానివ్వలేదు. ఎందుకంటె ఇది ఒక నిజాజీవితంలో జరిగిన కథ. చాలా జాగ్రత్తగా నిజాల్ని చూపించాలి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక దర్శకుడికి ఫ్రీడమ్ ఇవ్వాల్సినంత ఇచ్చి ఉయ్యాలవాడ నరసింహా పాత్రలో అద్భుతంగా నటించారని దర్శకుడు సురేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.