మెగా కాంపౌండ్ హీరోకు తలనొప్పిగా మారిన తోటి మెగా హీరోలు

మెగా కాంపౌండ్ హీరోకు తలనొప్పిగా మారిన తోటి మెగా హీరోలు

సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ మెగా మేనల్లుడు. అయినా మెగా ఫ్యామిలీ హీరోల నుంచి సరైన సపోర్ట్‌  రావడంలేదన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్. ప్రేక్షకులలోనూ, మెగా అభిమానులలోనూ సాయిధరమ్ కు మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం హిట్స్ లేకున్నా తేజూకి అవకాశాలు మాత్రం దండిగానే వస్తునాయి. ఈయంగ్ హీరోకి ఆఫర్లు బాగా వస్తున్నాయి కాని అతడు నటించిన సినిమాల రిలీజ్ కు సరైన డేట్ దొరకడంలేదన్నది ప్రస్థుతం చర్చనీయాంశమైంది.

 

కమర్షియల్ డైరెక్టర్ వినాయక్‌ తో కలిసి సాయి ధరమ్ తేజ్ ఒక భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తేజు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా విడుదలకు సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదని సమాచారం.  ఫెస్టివల్స్‌ డేట్స్ అన్ని మిగతా మెగా హీరోలు ముందుగా రిజర్వ్‌  చేసుకుంటూ ఉండటంతో ఈమెగా మేనల్లుడికి ఈ పరిస్థితి పట్టింది అని అంటున్నారు.

 

నిజానికి సాయిధరమ్ ‘జవాన్‌’ చిత్రాన్ని దసరాకి విడుదల చేద్దామనుకున్నారు. కానీ అది ఇప్పడు రకరకాల డేట్స్ మారి చిట్టచివరకు  డిసెంబర్‌ 1కి  ఫిక్స్ అయింది. ఇప్పుడు  వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను ఫిబ్రవరిలో రాబోతున్న మహాశివరాత్రి రోజున విడుదల చేయాలి అని భావిస్తే ఇప్పడు అదే డేట్ కు  వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ విడుదలకు రెడీ అవుతోంది.

 

సరే ఈ సినిమాను సమ్మర్ రేస్ లో నిలపెడదామని అనుకుంటే వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు రామ్ చరణ్  ‘రంగస్థలం’, ఆ తర్వాత అల్లుఅర్జున్ ‘నాపేరు శివ’ లైన్ లో ఉండటంతో  తేజు వినాయక్ ల భారీ సినిమావిడుదలకు మంచి డేట్ దొరకడంలేదని తెలుస్తోంది.

 

సాయిధరమ్ నటిస్తున్న ప్రతి సినిమా విడుదల డేట్ కు ఇలా కాంప్రమైజ్‌ అవుతూ పోతే ఇతడి కెరియర్ ఇలాగే చప్పగా సాగాల్సి వస్తుందని టాక్ వినిపిస్తోంది. మెగా కాంబౌండ్ నుంచి వచ్చిన ఈ హీరోకి అదే మెగా హీరోల సినిమాలు సమస్యగా మారాయి. మరి దీన్ని ఎలా సెట్ చేసుకుంటాడో  చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos