'కాలా'కు అన్ని చోట్లా రూట్ క్లియర్!

First Published 6, Jun 2018, 1:21 PM IST
Supreme Court clears way for release of kaala movie
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమాను జూన్ 7న విడుదల చేయబోతున్నట్లు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమాను జూన్ 7న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అసలు సినిమా విడుదలవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. దానికి కారణం కన్నడ సంఘాలు, తమిళ నాడార్ సంఘం ఈ సినిమా విడుదల కావడానికి వీల్లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా కర్ణాటకలో ఈ సినిమాను నిషేధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు వెల్లడించింది. కావేరీ వివాదంలో రజినీకాంత్ చేసిన కామెంట్స్ కారణంగా 'కాలా' విడుదల కాకుదంటూ పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను రిజక్ట్ చసిన కోర్టు 'కాలా' రిలీజ్ కు లైన్ క్లియర్ చేసింది. కాబట్టి చిత్రబృందం ప్రకటించినట్లు ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

loader