జైలర్ సెట్ లో సెలబ్రేషన్స్.. కేక్ కట్ చేసిన రజనీకాంత్, కారణమేంటంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా సెట్ లో అట్టహాసంగాసెలబ్రేషన్స్ జరిగాయి. తలైవా చేత కేక్ కూడా కట్ చేయించారు మూవీ టీమ్. ఇంతకీ ఈ సెలబ్రేషన్స్ ఎందుకని.

ఏడు పదుల వయస్సులో కూడా ఉత్సాహంగా దూసూకుపోతున్నాడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. వాటిని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు తలైవా. ప్రస్తుంత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ మూవీలో నటిస్తున్నాడు సూపర్ స్టార్. ఈమూవీ సెట్ లో కేక్ కటింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. రజనీకాంత్ చేత భారీ కేక్ కట్ చేయించారు మూవీటీమ్. ఈ వేడుకల్లో డైరెక్టర్ తో పాటు హీరోయిన్ తమన్నా కూడా కనిపించింది. ఇంతకీ ఈ సంబరాలకు కారణం ఏంటంటే..జైలర్ సినిమా షూటింగ్ నిన్నటితో కంప్లీట్ అయ్యింది.
అవును ఎట్టకేలకు జైలర్ సినిమా షూటింగ్ ను కంప్టీట్ చేసి..పేకప్ చెప్పేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి జైలర్ సినిమా కూడా ఒకటి. యాక్షన్ కామెడీ జోనర్‌లో జైలర్ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. వీరితో పాటు స్టార్ కాస్ట్ ఈసినిమాలో సందడిచేయబోతున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కు పేకప్ చెప్పేసిన సందర్భంగా జైలర్ సెట్స్‌లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్, తమన్నా అండ్ టీం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రజినీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. జైలర్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్ లాల్, సునీల్, తమన్నా పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
ఇక జైలర్ సినిమాకు తమిళ యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్ ఈసినిమాతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో తన కూతురు ఐశ్వర్యరజనీకాంత్ డైరెక్షన్ లో ఒకసినిమా చేస్తుండగా.. దీంతోపాటు జై భీమ్ ఫేం జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 మూవీ చేయబోతున్నాడు. ఈసినిమాలో విలన్ గా అర్జున్ ను రంగంలోకి దింపాలని ట్రై చేస్తున్నారు టీమ్. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వీటితో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు రజనీకాంత్.