స్పైడర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిన స్పైడర్ ఫ్యామిలీతో ఇటలీ వెళ్లిన మహేష్

సినిమాలతోపాటు కుటుంబానికి కూడా సమయాన్ని కేటాయించే నటుల్లో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటారు. షూటింగ్ ల నుంచి ఏ కాస్త విరామం దొరికినా.. భార్య, పిల్లలతో టూర్లు చెక్కేస్తుంటాడు. ఇప్పుడు కూడా మహేష్.. ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లారు.

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈచిత్రం.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా మహేష్ తన సినిమా ఏది రిలీజ్ అయినా కాస్త రిలీఫ్ కోసం విదేశాలకు వెళ్లడం చూస్తూనే వుంటాం.

 ‘స్పైడర్’ కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్‌లో రాకపోవడంతో ‘భరత్ అను నేను’ షూటింగ్‌ కి కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘భరత్ అను నేను’ షూటింగ్ రోమ్‌లో జరిగేలా డైరెక్టర్ ప్లాన్ చేశారట. ఇందుకు 40 మందికి టికెట్లు కూడా బుక్ చేశారు. కాకపోతే తాను టూర్ నుంచి వచ్చిన తర్వాతే షెడ్యూల్ గురించి ఆలోచన చేద్దామని మహేష్ చెప్పగానే టికెట్లను క్యాన్సిల్ చేసినట్లు టాలీవుడ్ వర్గం సమాచారం. 

వారు ఇటలీ వెళ్లామని తెలియజేస్తూ.. మహేష్ భార్య నమ్రత ఫేస్ బుక్ లో ఓ ఫోటో షేర్ చేశారు. వారి పిల్లలు గౌతమ్, సితారలు కివి చెట్టు కింద దిగిన ఫోటో అది. కివి ట్రీ కింద!!.. బ్యూటిఫుల్ టస్కనీ.. అంటూ నమ్రత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.