ఇక రంగంలోకి దిగబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సర్కారువారి పాట హడావిడి అయిపోయిన తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్.. త్రివిక్రమ్ సినిమా కోసం సై అంటున్నాడు  

సర్కారువారి పాట హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఫారెన్ ట్రీప్పులు వేస్తూ.. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. మధ్యలో చిన్న చిన్న సర్జరీలు చేయించుకుని... రెస్ట్ తీసుకున్నాడు. ఇక తన 
 తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు మహేష్. ఈసినిమా కోసం అంతా వెయిట్ చేస్తుండగా.. మరో నాలుగు రోజుల్లో సెట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. . 

సూపర్ స్టార్ 28వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. . ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. రెండు నెలల క్రితమే ఈమూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగును ఈ నెల 12వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు హైదరాబాదు .. అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. 

ఫష్ట్ షెడ్యూల్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. అన్నపూర్ణాలో వేసిన ప్రత్యేకమైన బస్ సెట్లో యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నాట. పక్కా మాస్ యాక్షన్ కంటెంట్ తో త్రివిక్రమ్ ఈ షెడ్యూల్ ను రూపొందిస్తున్నారట. ఇక మహేష్ బాబు ఈ మండే నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. 

ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సెంకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం.