మహేష్ బాబు ఎందరో చిన్నారులకు ప్రాణదాత అయ్యాడు. ఆయన వారసత్వాన్ని పంచుకున్న స్టార్ కిడ్ సితార.. ఆయన మంచితనాన్ని కూడా పంచుకున్నారు. దానికి నిదర్శణంగా ఓ సంఘటన జరిగింది. ఇంతకీ ఏమయ్యిందంటే..? 

మహేష్ బాబు ఎందరో చిన్నారులకు ప్రాణదాత అయ్యాడు. ఆయన వారసత్వాన్ని పంచుకున్న స్టార్ కిడ్ సితార.. ఆయన మంచితనాన్ని కూడా పంచుకున్నారు. దానికి నిదర్శణంగా ఓ సంఘటన జరిగింది. ఇంతకీ ఏమయ్యిందంటే..? 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు, సూపర్ స్టార్ గారాల పట్టి సితార తన మంచి మనసును చాటుకుంది. తండ్రి మాత్రమే కాదు పిల్లలు కూడా ఆయన వారసత్వంతో పాటు.. మంచితనం పంచుకున్నారు అనడానికి నిదర్శనంగా ఓ ఘటన తాజాగా చోటుచేసుకుంది. పెద్దల పట్ల గౌరవం చూపించే సందర్భాల్లో హోదాలు, అంతస్తులు గుర్తురావని సితార తన చేష్టలతో చూపించారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, వారి కూతురు సితార హాజరయ్యారు. 

ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేద వృద్ధులు, మహిళలకు బహుమతులు అందించారు. ఈ కానుకలు అందుకోవడానికి స్టేజిపైకి రావడానికి ఓవయసు మళ్లిన వృద్ధురాలు ఇబ్బంది పడగా.. ఏమాత్రం ఆలోరచించకుండా.. మహేష్ బాబు కూతురు సితార వెంటనే స్టేజి దిగి కిందకు వెళ్ళింది. ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత వారితో కలిసిపోయి నవ్వుతూ ఫొటోలు దిగింది. ఈ ఒక్క సంఘటన చాలు సితార మంచితనం తెలియడానికి. 

అయితే ఇదంతా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోతో పాటు..మహేష్ కు సబంధించిన మరో వీడియోను కూడా జత చేశారు. గతంలో గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మహేశ్ బాబు కూడా ఇలాగే ఓ మహిళకు సాయమందించారు. ఆ వీడియోతో కలిపి సితార వీడియోను ఎడిట్ చేసి.. పోస్ట్ చేశారు అభిమానులు. అంతే కాదు. తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్లు పెడుతూ.. అభిమానులు మురిసిపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సితారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.