ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్లిన  వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సినిమా వాళ్లంతా అభినందనలు తెలియచేస్తున్నారు. తాజాగా   సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ లో  అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.  అంతేకాకుండా ప్రధాని మోడీ సైతం ఆయన అభినందనలు తెలియచేసారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. 

ఇక గురువారం వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో ప్రభంజనం సృష్టించింది.