Rajnikanth: మరో కుర్ర దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్...?

తమిళ సూపర్ స్టార్ రజినీ (Rajinikanth) కాంత్ గత కొంత కాలంగా యంగ్ డైరెక్టర్లను బాగా ఎంకరేజ్ చేస్తన్నారు. తన  ఆరోగ్యం బాగోలేకపోయినా. సినిమాలను మాత్రం ఆపడంలేదు. యంగ్ స్టార్స్ కు లైఫ్ ఇచ్చే బాధ్యత తీసకున్నారు సూపర్ స్టార్.

Super Star Rajinikanth Movie with Young Director

తమిళ సూపర్ స్టార్ రజినీ (Rajinikanth) కాంత్ గత కొంత కాలంగా యంగ్ డైరెక్టర్లను బాగా ఎంకరేజ్ చేస్తన్నారు. తన  ఆరోగ్యం బాగోలేకపోయినా. సినిమాలను మాత్రం ఆపడంలేదు. యంగ్ స్టార్స్ కు లైఫ్ ఇచ్చే బాధ్యత తీసకున్నారు సూపర్ స్టార్.

ఈ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎక్కవగా ఇంటికే పరిమితం అయ్యారు సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth). రాజకీయాల్లోకి రావాలి అనుకుని కూడా ఆరోగ్యం సహకరించకనే వెనకడుగు వేశారు రజని. కాని తనకు ఎంతో ఇష్టమైన సినినిమాలు మాత్రం ఆపలేకపోతున్నారు స్టార్ సీనియర్ హీరో. సాధ్యమైనంత వరకూ సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు.

ఈ మధ్య అన్నాత్తే మూవీ షూటింగ్ టైమ్ లో కూడా అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డారు రజనీ కాంత్(Rajinikanth). అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసకున్నారు. ఇక ఇప్పుడు  కొంచెం ఆరోగ్యం సహకరిస్తుండటంతో మళ్లీ మరో సినిమా చేయాలని రజనీ కాంత్ అనకుంటున్నారట. సినిమా కోసం అన్ని రకాలుగా ఆయన సిద్థం అవుతున్నట్టు తెలుస్తోంది.ఇంట్లో ఉండి కూడా నెక్ట్స్ సినిమా కోసం కథలు విన్నారట సూపర్ స్టార్.

ఇక ఈ మధ్య యంగ్ డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు రజనీ కాంత్ (Rajinikanth). గత ఐదారుఏళ్ళ నుంచీ యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్, పా రంజిత్. శివ లాంటి యంగ్ డైరెక్టర్స్ కు ఇప్పటికే కోలీవుడ్ లో లైఫ్ ఇచ్చారు రజనీ కాంత్ ఇప్పుడు మరో సారి మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట తలైవా.

కోలీవుడ్ లో ప్రస్తుతం విజయ్(Vijay) తో బీస్ట్  సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ తో రజనీ కాంత్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యే ఈ కుర్ర దర్శకుడు డాక్టర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. బీస్ట్ ఇంకా రిలీజ్ అవ్వకముందే తలైవాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు నెల్సన్. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలో సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios