సూపర్‌స్టార్ రజనీకాంత్ తో కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు తాను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నట్టు విశ్వనటుడు కమల్ హసన్ తెలిపారు.
రజనీ కాంత్ తో కలిసి నటించడానికి తాను ఎప్పుడూ రెడీగానే ఉన్నానన్నాడు కమల్ హాసన్. ఇప్పటికిప్పుడు రెడీ అంటే లోకేష్ కనగరాజ్ డైరెక్ష్ ల్ తాము మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అన్నారు. ఇంతకీ రజనీ కాంత్ తో కమల్ సినిమాఎప్పుడు,
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. దీంతో మీడియాతో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కమల్ హాసన్ సమాధానం చెప్పారు.
లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి నటిస్తారా.. అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను సిద్ధమేనని, రజనీకాంత్, లోకేష్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇటీవల కాలంలో తమిళంలో సరైన చిత్రాలు రాకపోవడానికి దర్శకులు లేదా హీరోలు కారణం కాదన్నారు. దర్శకులకు, నటీనటులకు సరైన అవకాశాలు లేకపోవడమే కారణమన్నారు.
అంతేకానీ, మంచి దర్శకులు లేదా మంచి నటీనటులు లేరని అర్థం కాదన్నారు. విక్రమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఉత్తరాదికి వెళ్ళినపుడు ఉత్తరాది, దక్షిణాది అనే మాటలు వినిపించాయన్నారు. నిజం చెప్పాలంటే సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయణం ఉన్నట్టుగానే ఇది కూడా అలాంటిదే.. అన్నారు.
ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో కేవలం.. ఒక్క డైలాగ్ మాత్రమే ఉందన్న ప్రశ్నపై స్పందిస్తూ, అసలు డైలాగులే లేకుండా తాను నటించిన సందర్భాలు ఉన్నాయి కదా.. అని ప్రశ్నించారు. గతంలో వచ్చిన చాలా సినిమాలు ముందుగా తమిళంలో.. విడుదలైన విజయం సాధించిన ఐదారు నెలల తర్వాత హిందీలోకి అనువదించారు. అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించాయి. అని అన్నారు కమల్ హాసన్.
ఇక ఇపుడు విక్రమ్ మూవీ ఒకేసారి దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి..విడుదలై అన్ని భాషల్లో హిట్ సాధించింది. ఈ సక్సె్‌సను ఎంజాయ్ చేస్తున్నాను.. అదీకూడా వారం పది రోజులు మాత్రమే, ఆ తర్వాత షరా మామూలే.. ఈ విజయాన్ని తలకెక్కించుకోవడం అంటూ జరగదు.. అని తెలిపారు కమల్. దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ... తన సినిమాల్లో డ్రగ్ మాఫియా అంశాన్ని ప్రధానంగా చేసుకున్నప్పటికీ అందులో ఒక సందేశం ఉంటుందని చెప్పారు.
