దీపావళి దీపాల కాంతులతో వెలిగిపోతూ నిజంగానే పండుగకే కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. దీపావళిని సినీ తారలు మరింత ఉత్సాహంగా జరుపుకుని తమ ఆనందాన్ని పంచుకుంటారు. తమ అభిమాన తారలు ఇలాంటి పండుగల్లో పాల్గొంటే ఇక అభిమానులకు అంతకంటే ఆనందం ఏముంటుంది. రెచ్చిపోయి వాళ్ళు కూడా పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటారు. 

తాజాగా దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. తమ ఫ్యామిలీతో కలిసి ఆయన సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం ఆయన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. రజనీకాంత్‌ టపాసులు కాలుస్తూ కనిపించడం మరింతగా ఆకట్టుకుంటుంది. ఇందులో రజనీకాంత్‌, ఆయన భార్య లతా రజనీకాంత్‌, ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్‌, ఆమె భర్త పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.