కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ప్రతిసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకుంటున్నప్పటికీ చివరికి లాభాలను అందించడంలో విఫలమవుతున్నారు. వరుసగా కబాలి - కాలా - పేట సినిమాలతో పాటు 2.0 సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. 

ఇక ఇప్పుడు కసితీరా బాక్స్ ఆఫీస్ పై పగ తీర్చుకునేందుకు తలైవా రెడీ అయ్యాడు. ఏఆర్.మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో సూపర్ స్టార్ విభిన్న యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించనున్నాడట. ఇక కసిగా కనిపిస్తున్నట్లు సినిమాకు సంబందించిన సెకండ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. 

ఆ పోస్టర్ తెలుగు తమిళ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. మొదటిసారి స్టార్ డైరెక్టర్ మురగదాస్ రజినీకాంత్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ సినిమాతో అయినా తలైవా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.