సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ అంటూ వస్తున్న మహేష్ బాబు.. ఇందులో స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున కేవలం వాయిస్‌తో పలకరించిన మహేష్ బాబు.. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అందులో ప్రస్తావించడం సోషల్ మీడియాలో చర్చనీయమైంది.

అయితే, దీనిపై ఎలాంటి గందరగోళం వద్దని నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. ‘‘మహేష్ బాబు ప్రమాణం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే, కానీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌‌కు కాదు. నాలుగేళ్ల కిందటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’’ అని పేర్కొన్నారు. ‘ఫస్ట్ ఓథ్’ ఆడియో విడుదల ముందే దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. కల్పిత రాజకీయ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. 

ఇందులో సీఎం భరత్ గర్ల్ ఫ్రెండ్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాత