వరల్డ్ ఉమెన్స్ డే  సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు.  

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళాశక్తిని వారి విజయాలను ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటుంది. మహిళల పట్ల అపార గౌరవం కలిగిన హీరో మహేష్ బాబు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీ శక్తి సామర్ధ్యాలు, మొక్కవోని దీక్ష, నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతాయి. మీ విజయాలను ఈ ప్రపంచం జరుపుకుంటుంది. మా ఆవిడకు అలాగే ప్రపంచంలోని ప్రతి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు విపరీతమైన మహిళా అభిమాన గణాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. 

ఇక మహేష్ బాబు జీవితంలో నమ్రత శిరోద్కర్ కీలక పాత్ర వహిస్తున్నారు. అర్ధాంగిగా, ఆంతరంగిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అటు ఫ్యామిలీ బాధ్యతలు ఇటు వ్యాపార దక్షత నెరవేరుస్తున్నారు. మహేష్ చేసే వ్యాపారాలన్నీ నమ్రత ఆలోచన నుండి పుట్టినవే. ఆదర్శ భార్యతో పాటు తల్లి అయిన నమ్రత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంది. తర్వాత మహేష్ బాబు కెరీర్ బాధ్యత తీసుకొని, సూపర్ స్టార్ గా ఎదగడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. 18 ఏళ్ళుగా మహేష్-నమ్రతల దాంపత్యం ఆదర్శవంతంగా కొనసాగుతుంది. 2005లో నమ్రత-మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార సంతానం. 

Scroll to load tweet…

మరోవైపు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 28 చిత్ర షూట్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఉన్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో థియేటర్స్ లోకి రానుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుంది.