కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతూనే ఉంది. ఇండియాలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనితో సామాన్య ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారీన పడుతున్నారు.
కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతూనే ఉంది. ఇండియాలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనితో సామాన్య ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారీన పడుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా చిత్ర పరిశ్రమ మొత్తం సినీ తారలు ఒక్కొక్కరుగా కరోనాకి గురవుతున్నారు.
ఇప్పటి వరకు అర్జున్ కపూర్, మంచు మనోజ్, విశ్వక్ సేన్, సీనియర్ హీరోయిన్ మీనా, మంచు లక్ష్మీ, ఏక్తా కపూర్ లాంటి సెలెబ్రిటీలు కరోనాకి గురైన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనాకు గురయ్యారు. తనకు కరోనా సోకినట్లు మహేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనితో మహేష్ అభిమానుల్లో చిన్నపాటి ఆందోళన నెలకొంది. అయితే తనకు కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు మహేష్ తెలపడం ఊరట కల్గించే అంశం.
' నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయ్. దీనితో నేను నా ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటున్నా. వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాతో కొన్నిరోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ కోవిడ్ రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి' అని మహేష్ బాబు ట్విట్టర్ లో తెలిపారు.
ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో దుబాయ్ టూర్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 1 సందర్భంగా మహేష్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు.
