ఇండియా వ్యాప్తంగా సినీ అభిమానులకు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కిక్కు బాగా ఎక్కేసింది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించే చర్చించుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకులని మాత్రమే కాక సెలెబ్రటీలని సైతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అలరిస్తోంది.

ఇండియా వ్యాప్తంగా సినీ అభిమానులకు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కిక్కు బాగా ఎక్కేసింది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించే చర్చించుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకులని మాత్రమే కాక సెలెబ్రటీలని సైతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అలరిస్తోంది. Ram Charan, NTR సాహసాలు.. యాక్షన్ స్టంట్స్, స్వాతంత్ర పోరాట యోధులుగా ఇద్దరి లుక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. 

గురువారం రోజు విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. అంతా యునానిమస్ గా త్రిల్లర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ Mahesh Babu కూడా అదే మాట అన్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి మహేష్ ట్విట్టర్ లో స్పందించాడు. 

ట్రైలర్ గురించి మహేష్ ట్విట్టర్ లో .. 'ట్రైలర్ లో ప్రతి షాట్ స్టన్నింగ్ గా, మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి ఈజ్ బ్యాక్. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ ఫీల్ అయ్యా' అని కామెంట్ పెట్టాడు. 

మహేష్ బాబుకే గూస్ బంప్స్ వచ్చాయంటే ట్రైలర్ ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమంత, చిరంజీవి, పూజ హెగ్డే, వరుణ్ తేజ్, డైరెక్టర్ బాబీ, అనిల్ రావిపూడి లాంటి సెలెబ్రిటీలంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్ర నేపథ్యం అందరికి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. క్యారెక్టర్స్ రియల్ అయినప్పటికీ కథ మాత్రం కల్పితం. ట్రైలర్ లో రాజమౌళి కథ గురించి ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చారు. బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన వీరుడిగా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఇక రాంచరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. బ్రిటిష్ వారి అరాచకాలు, పరిస్థితుల ప్రభావం వల్ల వీరిద్దరికి స్నేహితులుగా మారి ఎలా పోరాటం చేసారు అనేది ఈ చిత్ర కథ. జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: RRR Movie: రాజమౌళి కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది ?