Asianet News TeluguAsianet News Telugu

జిమ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కసరత్తులు, వైరల్ అవుతున్న ఫోటో

సూపర్ స్టార్ మహేష్ బాబు జిమ్ములో తెగ కష్టపడుతున్నాడు. మహేష్ జిమ్ సంబంధించిన వీడియోలు కాని.. ఫోటోస్ కాని ఎప్పుడు వచ్చింది లేదు. కాని ఫస్ట్ టైమ్ మహేష్ జిమ్ చేస్తున్న పోటో బయటకు రావడంతో పాటు తెగ వైరల్ అవుతుంది. 

Super Star Mahesh Babu Gym Photos Viral
Author
First Published Nov 10, 2022, 5:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు జిమ్ములో తెగ కష్టపడుతున్నాడు. మహేష్ జిమ్ సంబంధించిన వీడియోలు కాని.. ఫోటోస్ కాని ఎప్పుడు వచ్చింది లేదు. కాని ఫస్ట్ టైమ్ మహేష్ జిమ్ చేస్తున్న పోటో బయటకు రావడంతో పాటు తెగ వైరల్ అవుతుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్స్ మీదకు వెళ్ళక చాలా కాలం అవుతుంది. సర్కారువారి పాట సినిమా తరువాత లాంగ్ గ్యాప్ వచ్చింది మహేష్ కు. ఇక ప్రస్తుతం  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. వీరిద్దరి కాంబోలో  ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాకు ఫస్ట్ నుంచి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. 

ఎలాగు  ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాలో పూజా హెగ్డే మహేష్ తో రెండోసారి జతకడుతోంది. అయితే పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో షూటింగ్ వాయిదా పడింది. కాలికి గాయమైన విషయాన్ని పూజా హెగ్డే గత వారం ఫోటో షేర్ చేసి మరీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక రెండో షెడ్యూల్ వాయిదా పడడంతో మన సూపర్ స్టార్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు. జిమ్ లో మహేష్ తెగ కష్టపడుతున్నారు. 

 

మహేష్ జిమ్ చేస్తున్న ఫోటోని రీసెంట్ గా  ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈఫోటోను చూసిన  ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.  మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా పెరుగుతున్నాయి.  

ఈసినిమా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవరోదం తప్పడంలేదు. మహేష్ కాలికి సర్జరీ, రమేష్ బాబు మరణం, తరువాత మహేష్ తల్లి ఇందిరా దేవి మరణం, ఇక ఇప్పుడు పూజా హెగ్డే కాలికి గాయం ఇలా త్రివిక్రమ్ సినిమాకు ఏదోఒక రకంగా అడ్డంకులు తప్పడం లేదు. ఇక ఉన్న టైమ్ ను ఉపయోగించుకుంటూ..మహేష్ జిమ్ములో కుమ్ముతున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios