ఓటీటీలో గుంటూరు కారం, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంక్రాంతి కానుకగా సందడి చేసిన గుంటూరు కారం ఓటీటీలో సందడి చేయబానికి రెడీ అవుతోంది. ఇంతకీ ఎప్పుడే..? ఏఫ్లాట్ ఫామ్ లో అంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ మసాలా సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు 12 ఏళ్లు గ్యాప్ తో వీరిద్దరి కాంబినేషన్‌లో..ముచ్చటగా వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం. దాంతో ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్అయిన ఫస్ట్ డే కాస్త యావరేజ్ టాక్ వచ్చినా.. ఆతరువాత బాక్సాఫీస్ సీన్ చూసి అభిమానులు కాస్త హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఇక రిలీజ్ అయిన అప్పటి నుంచి ఇపపటి వరకూ.. దాదాపు 250 కోట్లకు పైగా కలెక్ఫన్స్ ను రాబట్టి.. పర్వాలేదు అనిపించింది. కాకపోతే హనుమాన్ సినిమా ప్రభావం ఈసినిమాపై పడటంతో.. గుంటూరు కారం సినిమా కాస్త వెనకడుగు వేయక తప్పలేదు. ఇక ఈసినిమా థియేటర్ లో ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. థియేటర్ లో చూడనివారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదరు చూస్తున్నారు. ఈక్రమంలో ఈమూవీ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధం అయ్యింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలుపుతూ.. రౌడీ రమణని 70 ఎంఎం లో చూశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో చూడడానికి సిద్ధమవ్వండి. గుంటూరు కారం సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది అంటూ మేకర్స్ వెల్లడించారు.