ప్రముఖ ప్రొడ్యూసర్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా కొనసాగిన నారాయణ దాస్ కే నారంగ్ (Narayana Das k Narang) లేరనే చేదునిజాన్నిసినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, ఏషియ‌న్ ఫిలింస్ అధినేత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌ నారాయ‌ణ్‌ దాస్ కె.నారంగ్ (78) అనారోగ్యంతో మంగళ వారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్న నిర్మాత నారాయణ్ దాస్ కే నారంగ్ ఈరోజు తుదిశ్వాస విడిచారనే నిజాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికన సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 

తగ కొన్నిరోజులుగా ఓప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న నారాయణ్ దాస్... పరిస్థితి చేయి దాటడంతో తుది స్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఎమోషన్ అయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికన నివాళి తెలిపారు. ‘నారాయణదాస్ నారంగ్ గారి మరణంతో నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తి.. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయనతో కలిసి పనిచేయడం నా జీవితంలో ఓ విశేషంగా భావిస్తున్నాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. 

అలాగే మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ (Acharya) చిత్ర యూనిట్ కూడా నారాయణ దాస్ కే నారంగ్ కు నివాళి అర్పించారు. ‘ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఇక నారాయణ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలియ‌జేశారు.

Scroll to load tweet…

నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.

Scroll to load tweet…