Asianet News TeluguAsianet News Telugu

సినీ విషాదంః `సూపర్‌మ్యాన్‌` సృష్టికర్త రిచర్డ్ డోనర్‌ కన్నుమూత

ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన `సూపర్‌ మ్యాన్‌` చిత్ర సృష్టికర్త ఇకలేరు. `సూపర్‌మ్యాన్‌`, `గూనీస్‌`, `లెథల్‌ వెపన్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను రూపొందించిన హాలీవుడ్‌ దర్శకుడు రిచర్డ్ డోనర్‌ (91) కన్నుమూశారు.

super man creater director richard donner dies arj
Author
Hyderabad, First Published Jul 6, 2021, 11:19 AM IST

ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన `సూపర్‌ మ్యాన్‌` చిత్ర సృష్టికర్త ఇకలేరు. `సూపర్‌మ్యాన్‌`, `గూనీస్‌`, `లెథల్‌ వెపన్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను రూపొందించిన హాలీవుడ్‌ దర్శకుడు రిచర్డ్ డోనర్‌ (91) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో ప్రపంచ చిత్రసీమలోనే విషాద ఛాయలు అలుముకున్నాయి. 

1960లో టీవీలో ప్రసారమయ్యే `ట్విన్‌ లైట్‌ జోన్‌` అనే స్పై థ్రిల్లర్‌ స్టోరీస్‌తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు రిచర్డ్.  1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కిన `సూపర్ మ్యాన్` రిచర్డ్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ సిరీస్‌లో ఆ తర్వాత పలు చిత్రాలు తెరకెక్కాయి. తెలుగుతో పాటు హిందీలో `సూపర్ మ్యాన్` స్టోరీతో పలు చిత్రాలు అదే టైటిల్‌తో  తెరకెక్కాయి. 1985లో ఆయన డైరెక్ట్ చేస్తూ నిర్మించిన `గూనీస్` మంచి పేరు తీసుకొచ్చింది. కొంత మంది పిల్లలు ఎక్కడో ఉన్న గుప్త నిధులను ఎలా కనుగొన్నారనేది ఈ స్టోరీ. హాలీవుడ్‌లో ఈ అడ్వెంచర్ డ్రామాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. 

అంతేకాదు ప్రపంచ సినిమా చరిత్రలో `గూనీస్` కల్డ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. `సూపర్ మ్యాన్` కంటే ముందు 1976లో `ఫ్రీ విల్లీ అండ్ లాస్ట్ బాయ్స్` ఈయనకు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుత హాలీవుడ్‌ దిగ్ధర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా రిచర్డ్ తెరకెక్కించిన `గూనీస్` సినిమా ఇన్ స్పిరేషన్‌తో పలు చిత్రాలను తెరకెక్కించినట్టు అనేక సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు ఎంతో హాలీవుడ్ దర్శకులకు ఈయన సినిమాలు ఓ నిఘంటువులా పనిచేశారని కొనియాడారు. రిచర్డ్ మృతిపై పలువురు హాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios