కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఫొటోలతో అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కాలా సినిమా నిరుత్సాహపరచడంతో 2.0 పై అంచనాలు భారీగా పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. 

సినిమాలో ఫ్యాన్స్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక రజినీకాంత్ అభిమానులు బయటప్రపంచానికి వారి అభిమానాన్ని వివిధ రకాలుగా చూపిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఆటో వాలా తన ఆటోకు మొత్తంగా 2.0 స్టైల్ అద్దేశాడు. మొబైల్స్ తో అక్షయ్ కుమార్ పాత్రను గుర్తు చేస్తూ టాప్ లో చిట్టి ని సరికొత్తగా సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తలైవా ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇక సినిమా కలెక్షన్స్ మొదటి రోజు భారీగానే అందాయి. ఎప్పుడు లేని విధంగా కొన్ని ఏరియాల్లో కొత్త రికార్డులను ఈ చిత్రం నమోదు చేయగా రజిని కెరీర్ లోనే మొత్తంగా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా 2.0 నిలిచింది.