శృంగార తారగా పాపులర్ అయిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంలో వరుసగా విమర్శలు ఎదురయ్యాయి. మీడియా నుంచి పదే పదే అశ్లీల చిత్రాల నటి అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ విమర్శలకు భాదపడ్డప్పటికీ కుంగిపోకుండా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. 

ప్రస్తుతం సన్నీలియోన్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ చిత్రాలలో కూడా నటిస్తోంది. నటిగా రాణిస్తూనే వాణిజ్య ప్రకటనలతో సైతం సన్నీ బిజీగా మారిపోయింది. సన్నీలియోన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫోటో వైరల్ అవుతోంది. 

భర్త డానియల్ వెబర్, పిల్లలతో కలసి సన్నీలియోన్ తన నివాసంలో వినాయక చవితి సందర్భంగా పూజ చేసింది. గణపతి విగ్రహం ముందు తన ఫ్యామిలీతో సాంప్రదాయ వస్త్రధారణలో సన్నీలియోన్ ఉన్న ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఏ వృత్తిలో పనిచేస్తున్నా దైవం ముందు అంతా సమానులే అని సన్నీలియోన్ తన భక్తిని చాటుకుంది. సన్నీలియోన్ లో చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.